కాకినాడ JNTU లో ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు మరొక పది రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ తరుణంలో రెండు రోజుల క్రితం వీళ్ళకి మరొక కొత్త సబ్జెక్టును ఆడ్ చేయడం ఆందోళన కలిగించింది. ఇప్పటికిప్పుడు సబ్జెక్టు మొత్తం చదివి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకోవడం వారి వల్ల కాదని విద్యార్థులు ఉదయం నుండి జెఎన్టియు గేటు వద్ద ఆందోళన చేస్తుండడంతో పోలీసు శాఖవారు సంఘటనా స్థలానికి విచ్చేసి ప్రిన్సిపల్గారితో మాట్లాడి విద్యార్థుల సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు.