శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను ఆకాశంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేశారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈరోజు ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటలపాటు నిరంతరాయంగా సాగిన తరువాత్త వాహకనౌక నింగిలోకి దూసుకెళుతుంది.. ఈ రాకెట్‌ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తోపాటు మనదేశానికి చెందిన 18 ఉపగ్రహాలను ఒక నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారని అధికార వర్గాల సమాచారం.