వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ర్యాలీ రేసర్ హన్నూ మికోలా కన్నుమూత

ఫ్లైయింగ్‌ ఫిన్‌గా ప్రసిద్ధి పొందిన హన్నూ మికోలా(78) కన్నుమూశారు. మికోల కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈయన శనివారం కన్నుమూసినట్టు వార్తలు ప్రచురించగా దానిని వారి కుమారులు కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువపరచారు. ‘ మీరు విన్నది నిజమే.. ఫ్లైయింగ్‌ ఫిన్‌ ఇక మనకు లేరు. ఈ చేదు వార్తను మీతో పంచుకోవడం బాధాకరం.’ అంటూ ట్వీట్‌ చేశారు.

మికోలా తన కెరీర్‌ను వోల్వో కారుతో ప్రారంభించారు. ఆ తరువాత ఎక్కువభాగం ఫోర్డ్‌, ఆడీ కార్లతో రేసింగ్‌లో పాల్గొన్నారు. ఈయన టాప్ 10 ర్యాలీ డ్రైవర్స్‌లో ఒకడిగా పేరు పొందారు. 1979లో ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో రన్నరఫ్‌గా, 1983లో ప్రపంచ ర్యాలీ రేస్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు. అతని మరణ వార్త తెలిసి మాజీ ర్యాలీ చాంపియన్స్‌ కార్లోస్‌ సైంజ్‌, సెబాస్టియన్‌ ఓగిర్‌, పీటర్‌ సోల్డ్‌ బర్గ్‌లు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.