ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వాలు ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ మద్యం తాగుతూ వాహనాలు నడుపుతూ భీభత్సం సృష్టిస్తున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక విషయానికి వస్తే వనస్థలిపురంలో మద్యం తాగి ఒకరి మృతికి కారణమైన సంఘటన జరిగి ఇంకా 24 గంటలు కూడా గడవక ముందే మరో సంఘటన హైదరాబాద్ పరిథిలోని జరగడం దురదృష్టకరం.

తాజాగా నటుడు షణ్ముక్ జస్వంత్ మద్యం మత్తులో వాహనం అతి వేగంగా నడుపుతూ పలు వాహనాలు ఢీకొట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కార్ ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో బర్త్ అనలైజర్ టెస్టులో 170 పాయింట్లు గా తేలిందని , దీనితో కార్ సీజ్ క్సహేశామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.