మహారాష్ట్రలో 36,902 కొత్త కేసులు బయటపడ్డాయి. 112 మంది ప్రాణాలు వదిలారు. ఇప్పుడు ఆక్టివ్ కేసులు 2.83లక్షలకు చేరాయి. మొత్తం 26లక్షల మందికి పైగా వైరస్ సోకితే సుమారు 23లక్షల మంది దాన్నుంచి బయటపడ్డారు. కొత్త కేసులు పెరిగిన దరిమిలా ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూను విధించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. షాపింగ్‌ మాల్స్‌ను రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఏడు వరకు మూసి ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ నిబంధనల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే..ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని ఠాక్రే హెచ్చరించారు.