వార్తలు (News)

62,258కు చేరుకున్న కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 62,258 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 291 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 1,19,08,910 మంది మహమ్మారి బారిన పడగా 1,61,240 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 4,52,647 ఆక్టివ్ కేసులుండడంతో ఆ రేటు 3.55 శాతానికి పెరిగింది. ఇక, నిన్న ఒక్కరోజే 30,386 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 1.12 కోట్ల మంది వైరస్‌ నుండి కోలుకోగా రికవరీ రేటు 95.09 శాతానికి పడిపోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.