వార్తలు (News)

పండగవేళ కరోనా నిబంధనలు

కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి మున్ముందు రాబోయే పండగల సందర్భంగా కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. దానిలో ‘‘ప్రస్తుతం దేశం సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న విషయం మీకందరికీ తెలుసు. కొన్నిరోజులుగా చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అందుకే ఇకముందు పరీక్షలు(టెస్ట్‌), గుర్తించడం(ట్రాక్‌), చికిత్స(ట్రీట్‌మెంట్‌) విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు జిల్లా, ఉపజిల్లా, నగరం, వార్డు స్థాయిల్లో స్థానిక ఆంక్షలు కూడా విధించుకోవచ్చు. ఇప్పుడు హోలీ, సాబ్‌-ఎ-బరాత్, పంటకోత, ఈస్టర్, ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండగలు వస్తున్న నేపథ్యంలో జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతిచోటా మాస్క్‌ ధరించడంతో పాటు, భౌతికదూరం పాటించేలా చూడాలి. ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.