కోవిడ్ ఎవరిని వదిలిపెట్టడం లేదనేది మరోసారి రుజువయ్యింది. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ విషయాన్ని టెండూల్కరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “కోవిడ్‌ను దూరంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వచ్చాను. పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేయించుకుంటున్నాను. అయినా ​ఇవాళ నాకు కోవిడ్ వచ్చినట్లు నిర్ధరణ అయింది లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి” అని టెండూల్కర్ ట్వీట్ చేశారు.

తన కుటుంబంలోని మిగతా వారందరికీ నెగెటివ్ వచ్చిందని, హోం క్వారెంటైన్లో ఉంటూ డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తున్నానని చెప్పిన సచిన్, తనకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.ప్రజలందరూ కూడా కోవిడ్ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాని బారి నుండి తప్పించుకోవాలని ఆయన కోరారు.