ఆంధ్ర ప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 947 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 8,97,810 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 377 మంది బాధితులు కోలుకోగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,85,892కి చేరింది.గడచిన 24 గంటల్లో ఎవరు ప్రాణాలు కోల్పోకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,58,897 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,49,58,897 కరోనా నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,715 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది

జిల్లాల వారీగా కేసులు:

.