వార్తలు (News)

పాతబస్తి గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం

బహదూర్‌పుర పాతబస్తీలో వరుసగా నాలుగు గోదాముల్లో మంటలు చెలరేగి వాహనాల విడిభాగాలు, బొగ్గు, మరో రెండు గోదాములు ఒకదాని పక్కన ఒకటి ఆనుకొని ఉండగా గోదాముల వెనుకభాగం నుంచి మంటలు వ్యాపించడంతో పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గమనించలేదు. స్థానికులు మంటలను గమనించే సరికి గోదాములు పూర్తిగా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది , పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. భారీ అగ్ని ప్రమాదం కావడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి.

ప్రధాన రహదారి పక్కన గోదాములు ఉండటంతో వాహనాలు నిలిచిపోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నగర పోలీసు సంయుక్త కమిషనర్‌ తరుణ్‌ జోషి, హైదరాబాద్‌ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించి మంటలను అదుపు చేయడం కష్టంగా మారడంతో గోదాముల గోడలను ప్రొక్లెయిన్‌తో కూల్చివేసి అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఆరుగంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో దాదాపు రూ.50లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని గోదాము యజమానులు బాధపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.