వార్తలు (News)

ట్యాంక్‌బండ్ పై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

హైదరాబాద్ ఆర్‌పీ రోడ్‌లో నివాసముండే టి విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి. శుక్రవారం మధ్యాహ్నం విజయ్ కుమార్ అతని భార్యతో కలిసి ఓపెల్ కోర్స కారు నెంబర్ ఏపీ 10 క్యు 2888లో సచివాలయం సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు వెళ్లి పని ముగించుకుని తిరిగి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్తుండగా హోటల్ మారియట్ దాటి సెయిలింగ్ క్లబ్ వద్దకు రాగానే కారు వెనక నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దారిలో వెళ్లే వాహనదారులు, పాదచారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కారు వెనక ప్రయాణిస్తున్న వారు దానిలో నుంచి మంటలు రావడం గమనించి కారులో ప్రయాణిస్తున్న వారికి ఈ విషయం చెప్పగా ఆందోళనకు గురైన విజయ్ కుమార్, అతడి భార్య వెంటనే కారు దిగి పోయారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో కారు మంటల్లో కాలి పోతుందని ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని విజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో జరగడంతో ఈ సరిహద్దు తమది కాదంటే తమది కాదంటూ పోలీసులు చెప్పడంతో షాక్‌కు గురైన విజయ్ కుమార్ చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.