మత్తిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో హోసూరు సమీపంలోని బేళగొండపల్లి గ్రామానికి చెందిన గురురాజ్(24)కు అనే వ్యక్తి గురువారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఆరవేస్తూ విద్యుత్తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇతనికి నాలుగు నెలల క్రితమే వివాహం కావడంతో చూసిన ప్రతిఒక్కరు కంటతడి పెడుతున్నారు. ఈ ఘటనపై మత్తిగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.