ఏప్రిల్ అంటే కొత్త ఆర్ధిక సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ కారణంగా ఆ రోజు నుండి చాలా కొత్త రూల్స్ ని అమలు చేయాలని ప్రభుత్వాలు ఎదురు చూస్తుంటాయి. దీనివల్ల చాలా మందిపై ఎఫెక్ట్ పడుతుంది.

దీనిలో భాగంగానే ఏప్రిల్ 1 నుండి కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. వాటిలో ముఖ్యంగా పాలు, ఏసీ, ఫ్యాన్, టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. విమాన టికెట్ ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే టీవీల ధరలు కూడా కొండెక్కనున్నాయి. టీవీ ధర రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఏసీల ధర రూ.1500 నుంచి రూ.2 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇవే కాకుండా కార్ల ధరలు కూడా ఏప్రిల్ నుంచి పెరగనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు అదే విషయాన్ని వెల్లడించాయి. వీటన్నిటికీ ముడి పదార్థాల ధరలు పెరగడం కారణంగా చెప్తున్నారు.