టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రిఫ్రిజిరేటర్ లు, వాషింగ్ మెషిన్‌ లపై అమెజాన్ భారీ డిస్కౌంట్లు ..!

ప్రస్తుతం అమెజాన్ ‘ప్రైమ్‌ డే సేల్‌’ జరుగుతున్న సంగతి పాఠకులకు విదితమే! ఈ సేల్ లో వాషింగ్ మెషిన్‌లు, రిఫ్రిజిరేటర్ల వంటి వస్తువులపై 65% వరకు ప్రకటించిన డిస్కౌంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్ కంపెనీ భారీ ధరల తగ్గింపులతో సహా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ముందుకు తెచ్చి మీ ఇంట్లో పాత రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్‌లు ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తీసుకోవచ్చని, కానీ ఈ ఆఫర్లన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే వర్తిస్తాయని వివరించింది. ఇక వాషింగ్ మెషిన్‌లు, రిపేర్ రిఫ్రిజిరేటర్లలపై ప్రకటించిన ఆఫర్ల గురించి చూడండి!

అతి తక్కువ కరెంటు యూస్ చేసే సింగల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ కొనుగోలు చేయాలనుకుంటే
5-స్టార్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎల్‌జీ రిఫ్రిజిరేటర్‌ రూ.15,590కే సొంతం చేసుకోవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్‌ వల్ల మీ కరెంటు బిల్లు నామమాత్రంగానే పెరుగుతుంది. దీని కెపాసిటీ 190 లీటర్లు కాగా దీని ఎమ్మార్పీ ధర రూ.20,390. అమెజాన్ ప్రైమ్ డే సెల్ లో కొనుగోలు చేస్తే మీకు రూ.4,800 ఆదా అవుతుంది.

సామ్‌సంగ్ సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్‌ @12,690 : రూ.13,000 లోపు సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే అమెజాన్ మీకొక ఒక మంచి ఆఫర్ ఇస్తోంది. సామ్‌సంగ్ 192 లీటర్ల రిఫ్రిజిరేటర్‌ కేవలం రూ.12,690 ధరకే విక్రయిస్తోంది. ఇందులో పదార్థాలను స్టోర్ చేసేందుకు బలమైన గాజు అల్మారాలు ఇచ్చారు. అలాగే ఇందులో కంటిన్యూస్ గా స్థిరమైన చల్లదనాన్ని అందించే టెక్నాలజీ ఉంటుంది.

హైయర్ డబుల్-డోర్ రిఫ్రిజిరేటర్‌ @23,790 : 253 లీటర్ల కెపాసిటీ గల హైయర్ డబుల్-డోర్ రిఫ్రిజిరేటర్‌ కేవలం రూ.23,790కే లభిస్తోంది. సింగల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి డబుల్-డోర్ ఫ్రిడ్జ్ కి అప్‌గ్రేడ్ కావాలనుకుంటే దీన్ని ఎంచుకోండి. 3-స్టార్ ఎనర్జీ సేవింగ్ రేటింగ్ తో రానున్న ఈ ఫ్రిడ్జ్ ఫ్రాస్ట్-ఫ్రీ టెక్నాలజీ కలిగి ఉంది. దీనివల్ల మీరు ప్రతీసారి డీఫ్రాస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు.

హైయర్ కంపెనీలోనే సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటే.. 565 లీటర్ల కెపాసిటీ ఫ్రిడ్జ్ ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రీమియం ఫ్రిడ్జ్ ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ప్రైమ్ డే సేల్ లో దీని ధర ఇప్పుడు రూ. 54,789 లుగా నిర్ణయించారు. ఎమ్మార్పీ ధర మాత్రం రూ.1,15,000 ఉంది. అంటే దాదాపు 52% రాయితీ ప్రకటించినట్లు తెలుస్తోంది.

వాషింగ్ మెషిన్‌లపై ప్రకటించిన ఆఫర్లు:
ఎల్‌జీ ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషిన్‌పై 5,500 తగ్గింపు : మీరు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషిన్‌ కొనుగోలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు 6 కిలోల ఎల్‌జీ వాషింగ్ మెషిన్ చెక్ చేయండి. ప్రైమ్ డే సేల్ లో దీని ధర రూ.24,490లుగా నిర్ణయించారు. దీని ఎమ్మార్పీ ధర రూ.29,990 ఉంది. ఇప్పుడే కొనుగోలు చేస్తే మీకు రూ.5,500 ఆదా అవుతుంది. 5-స్టార్ రేటింగ్ కలిగిన ఈ వాషింగ్ మెషిన్‌పై ఎక్స్చేంజి ఆఫర్ కూడా ఉంది. మీ పాత వాషింగ్ మెషిన్‌ను ఇచ్చేసి ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

సామ్‌సంగ్ 7.2 కిలోల సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్‌ @9,990 : 7.2 కిలోల సెమీ ఆటోమేటిక్ సామ్‌సంగ్ వాషింగ్ మెషిన్‌ కేవలం రూ.9,990కే లభిస్తుంది. దీనిపై రూ.3వేల పైగా రాయితీ లభిస్తోంది.

వర్ల్ పూల్ టాప్-లోడింగ్ వాషింగ్ మెషిన్‌ @16,740 : వర్ల్ పూల్ 7 కిలోల వాషింగ్ మెషిన్ కేవలం రూ.16,740కే లభిస్తోంది. ఈ 5-స్టార్ రేటెడ్ వాషింగ్ మెషిన్ తక్కువ కరెంట్ యూస్ చేస్తుంది. బట్టలను బాగా వాష్ చేసేందుకు ఇందులో 12-వాష్ ప్రోగ్రామ్‌లను ఇచ్చారు. దీన్ని కంట్రోల్ చేసేందుకు ఒక ఎల్‌సిడి డిస్‌ప్లేను కూడా ఇచ్చారు.

బాష్ ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషిన్‌ @32,990 : 7 కిలోల ఫ్రంట్-లోడింగ్ బాష్ వాషింగ్ మెషిన్‌ రూ.32,990 పొందవచ్చు. పాత వాషింగ్ మెషిన్‌ ఎక్స్చేంజి చేసి రూ.1,490 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీనిపై అమెజాన్ కంపెనీ రూ.6,809 రాయితీ ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •