టెక్నాలజీ (Technology) వార్తలు (News)

తెలంగాణాలో స్కూళ్ల రీఓపెన్ పై విద్యాశాఖ క్లారిటీ!!

కరోనా కారణంగా స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతపడి ఫస్ట్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ తెరిచే ప్రయత్నాలు జరిగినప్పటికీ కోవిడ్‌ విజృంభించడంతో అంటా వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు మళ్ళీ కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ స్కూళ్లు తెరిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లి తండ్రులు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ” వైద్య నిపుణులు సైతం చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుందని, టీచర్లు, స్కూల్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసి, మళ్లీ భౌతిక తరగతులు ప్రారంభించుకోవచ్చు అనే సంకేతాలు ఇస్తున్నారు “.

త్వరలోనే తెలంగాణలో స్కూళ్లు, విద్యాసంస్థలు రీఓపెన్‌ అవుతాయనే ప్రచారం సాగుతుండడంతో పాఠశాలలు భౌతిక తరగతుల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాధనలు సిద్ధం చేయలేదని , దానిపై ఎలాంటి చర్చలు కూడా సాగడం లేదని, ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో ఇప్పుడు చెప్పలేమని విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    11
    Shares
  • 11
  •  
  •  
  •  
  •