అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

చెన్నై విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా??

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి వస్తున్న ప్రయాణీకుల వద్ద రూ. 4 కోట్లకు పైగా విలువ చేసే 8.17 కేజీల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పడానికి నిందితులు బంగారాన్ని గృహోపకరణాల్లో దాచి తరలించే ప్రయత్నం చేసారు.

చెన్నై ఎయిర్‌పోర్ట్ లో దుబాయ్ నుండి తీసుకుని వచ్చిన రైస్ కుక్కర్, జూసర్, నెబ్యులైజర్ లో బంగారాన్ని అమర్చి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కస్టమ్స్ అధికారుల స్కానింగ్ లో ఈ అక్రమ బంగారం రవాణా బయట పడింది. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    65
    Shares
  • 65
  •  
  •  
  •  
  •