ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది??

మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చేపలు మొదటి స్థానంలో ఉంటాయి. ఎందుకంటే చేపల్లో కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ. నిపుణుల ప్రకారం వారంలో రెండుసార్లు చేపలు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు తో పాటు చేపలు కూడా కల్తీవే దొరుకుతున్నాయి. అందుకే చేపలు సూపర్ మార్కెట్ లో కొనడం చేస్తున్నారు. అయితే సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసే చేపలు తాజావా? కాదా అనేది తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవేంటంటే..

మొదట చేపలను వాసన చూసి కొనాలి. చేపలను వాసన చూసినప్పుడు సముద్రపు నీరు వాసన వచ్చినట్లయితే అవి తాజా చేపలు. ఆలా కాకుండా దుర్వాసన వచ్చినట్లయితే అవి ఖచ్చితంగా పాడైపోయినవి.

తరువాత చేపల కళ్లపై తెల్లటి పూత ఉన్నా, అవి లోతుగా ఉన్నా ఆ చేపలు పాడైపోయాయని అర్ధం! తాజా చేపలకు ఎప్పుడూ కూడా కళ్లు ప్రకాశవంతంగా, అలాగే ఉబ్బినట్లుగా ఉంటాయి.

చేప తాజాగా ఉందని నిర్ధారించుకోవడానికి, మొప్పలను ఎత్తి, చేపల లోపలి భాగాంలో గులాబీ రంగులో ఉందో లేదో చూడండి. నిజానికి, తాజా చేపల ఆకృతి కొద్దిగా తడిగా ఉంటుంది.

చేపలను కొనేటప్పుడు తాజా చేపల ఆకృతి లోపల, బయట ఒకేలా గట్టిగా ఉంటుంది. తాజా చేపల మాంసం శుభ్రంగా కనిపిస్తుంది. ఇక పాడైపోయిన చేపల చర్మంపై క్రస్ట్ ఉంటుంది. అలాగే అవి ప్రాణంలేనివి. సీఫుడ్ లేదా చేపలను ఎన్నుకునేటప్పుడు, మొదటిగా వాటి రంగును చూడాలి. చేపల రంగు ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. అలాగే వాటి కళ్లలో తెల్లటి పూతలు లేకుండా ఉండాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •