జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇండియన్ నేవీలో జాబ్ నోటిఫికేషన్ !!

షార్ట్ సర్వీస్ కమిషన్ 40 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. కరోనా కేసుల నేపథ్యంలో పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ మార్కులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై నెల 30వ తేదీలోపు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎలక్ట్రికల్ బ్రాంచ్ లో మొత్తం 40 ఉద్యోగ ఖాళీలు ఉండగా వీటి కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. 2022 సంవత్సరం జనవరి నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ బ్రాంచ్‌లో కోర్సు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయి. కేరళ రాష్ట్రంలోని ఎజిమల ప్రాంతంలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో కోర్సు నిర్వహణ ఉంటుంది.

1997 జనవరి 2 నుంచి 2002 జూలై 1 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. బెంగళూరు, కోల్‌కతా, భోపాల్, విశాఖపట్నంలలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    80
    Shares
  • 80
  •  
  •  
  •  
  •