జాతీయం (National) వార్తలు (News)

లాభాల ఝడిలో మొదలై.. నష్టాల ఒడిలో కుదేలైన మార్కెట్లు !!

మంగళవారం ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఒత్తిడి తో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెన్స్‌ 273 పాయింట్ల నష్టంతో 52,578 వద్ద ముగియగా నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 15,746 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎస్‌బీఐ, బజాజ్ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఏషియన్ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •