జాతీయం (National) వార్తలు (News)

రైల్వే ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరల తగ్గింపు!!

దక్షిణ మధ్య రైల్వే గతంలో కోవిడ్ కారణంగా ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ఫ్లాట్‌ ఫామ్‌ టికెట్ ధరలను అమాంతం పెంచేసిన సంగతి పాఠకులకు విదితమే! అయితే ప్రస్తుతం ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జోన్‌ నెట్‌వర్క్‌లో అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పునరుద్ధరించిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నామని డివిజన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో సికింద్రాబాద్, హైదరాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50 నుంచి రూ.20కి తగ్గగా మిగతా స్టేషన్లలో ప్లాట్‌ ఫాం టికెట్ ధర రూ.10కి తగ్గిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •