అంతర్జాతీయం (International) వార్తలు (News)

అమెరికాలో ఇసుక తుఫాన్ బీభత్సం??

అమెరికాలో ఉతా హైవేపై గంటకు 51 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఇసుక తుఫాన్ కారణంగా పెద్ద ఎత్తున వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇసుక తుఫాన్ దెబ్బకు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెట్రోలింగ్ సిబ్బంది సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో మొత్తం 20కి పైగా వెహికల్స్‌ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన కాసేపటికి ఇసుక తుఫాన్ శాంతించినా రోడ్డుకు ఇరువైపులా ధ్వంసమైన వాహనాలతో ఆ ప్రాంతం భీకరంగా మారిపోయింది. కనోష్-సాల్ట్‌లేక్ సిటీకి దక్షిణాన 258కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తుఫాన్ అనంతరం అక్కడి పరిస్థితులను చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. నిజానికి అమెరికాలో ఇసుక తుఫాన్‌లు, టోర్నడోలు సర్వసాధారణం. అయితే గాయపడిన వారు మాత్రం ఈ ప్రమాదం తాము తప్పించుకోడానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •