జాతీయం (National) వార్తలు (News)

శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల

కృష్ణానదికి వరద కొనసాగుతుండడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ లకు వరద నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం డ్యామ్‌కు 3,22,262 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఇక జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 160.9100 టీఎంసీల నీరు ఉంది.

మరోవైపు నాగార్జున సాగర్ కు 18,142 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 539.10 అడుగుల నీరు ఉండగా జూరాల జలాశయానికి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 3.35 లక్షల ఇన్ ఫ్లో ఉంది. వరద నీరు ఎక్కువగా వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు కిందకు వదులుతున్నారు. జూరాల డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •