క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

అస్సాం, మిజోరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు!!

అస్సాం, మిజోరం సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుని అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఈ మధ్యాహ్నం స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొందరు కాల్పులు జరపడంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో అస్సాంలోని కాచర్‌ జిల్లా ఎస్పీ నింబల్కర్‌ వైభవ్‌ చంద్రకాంత్‌ సైతం తీవ్రంగా గాయపడ్డారు.

సరిహద్దుల వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర ఆరోపణలు చేసుకుని ఘర్షణల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చించారు. ఉదయం నుంచే సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. దీనిపై జోక్యం చేసుకుని, ఈ దాడులను అరికట్టాలని అమిత్ షాను కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •