అంతర్జాతీయం (International) వార్తలు (News) వినోదం

వెరైటీ టిప్ ఇచ్చిన కస్టమర్ ..??

ఫుడ్‌ డెలివరీ యాప్‌లు పెరిగి ప్రజలు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తుండడంతో కరోనా సమయంలో ఫుడ్‌ డెలివరీ చేసే వారిని కూడా వారియర్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంఘటన వైరల్‌గా మారింది. ఆర్డర్‌ పెట్టిన కస్టమర్‌కు ఫుడ్‌ డెలివరీ చేసిన బాయ్‌ టిప్‌ అడిగీతే అప్పటికే కస్టమర్‌ వద్ద డబ్బులు లేకపోవడంతో ఆ డెలివరీ బాయ్‌కు ఊహించని టిప్‌ ఇచ్చాడు. అదేంటో తెలుసా? ‘నా దగ్గర డబ్బులు లేవు. పిజ్జాలో ఒక ముక్క (స్లైస్‌) తీసుకో’ అని కస్టమర్‌ చెప్పాడు. అయితే డెలివరీ బాయ్‌ ‘మీరేమైనా జోక్‌ చేస్తున్నారా’! అని ప్రశ్నించగా ‘లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు’ అని చెప్పడంతో డెలివరీ బాయ్‌ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో అతను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    65
    Shares
  • 65
  •  
  •  
  •  
  •