అంతర్జాతీయం (International) వార్తలు (News)

లిబియా లో 57 మంది శరణార్థుల జల సమాధి!

నైజీరియా, ఘనా, గాంబియా దేశాలకు చెందినవారు యూరప్‌లో మెరుగైన జీవితం కోసం సముద్ర మార్గంలో వెళ్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో పడవ ఆగిపోయింది. ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఇందుకు తోడవడంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. వీరు లిబియా పశ్చిమ తీర పట్టణం ఖుమ్స్ నుంచి ఆదివారం పడవ ప్రయాణం మొదలు పెట్టారు. బయలు దేరిన 24 గంటల్లో వారు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. మృతుల్లో 18 మంది మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కొద్దిపాటు జాగ్రత్తతో 18 మంది మాత్రం ఈదుకుంటూ వచ్చి సోమవారం ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన ప్రమాదంలో 57 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •