అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

కజకిస్థాన్‌లో భారీ పేలుళ్లు 9మంది మృతి.. 90 మందికి గాయాలు!!

కజకిస్థాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దక్షిణ కజకిస్థాన్‌లోని సైనిక ఆయుధాలు నిల్వచేసే గోదాం వద్ద చోటుచేసుకున్న వరుస పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందినట్టు, దాదాపు 90 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. దాదాపు ఆరు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. కిర్గిజిస్థాన్‌ సరిహద్దులోని తారాజ్‌ నగరం సమీపంలో మిలటరీ యూనిట్‌కు చెందిన గోదాం వద్ద ఈ పేలుళ్లు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో రహదారులను మూసివేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో 1200 మందిని ముందు జాగ్రత్తగా తరలించారు. అయితే, ఈ ఘటనకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •