వార్తలు (News)

హైదరాబాద్ లో కారు మబ్బులు.. భారీ వర్షం!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిన్న గురువారం నల్లని మేఘాలు కమ్ముకుని కొన్ని చోట్ల మోసర్త వర్షాలు కురవగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఎల్బీనగర్, నాగోల్, వనస్దలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పెట్, అబ్దుల్లా పుర్ మెంట్ పరిధిలలో భారీ వర్షం కురిసింది. అలాగే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ఉదయం నుండి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే, సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటు భారీ వర్షం మొదలైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •