క్రైమ్ (Crime) వార్తలు (News)

వైవాహిక అత్యాచారం కేసులో ఛత్తీస్ ఘడ్ ధర్మాసనం సంచలన తీర్పు??

వైవాహిక అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. వివాహితులైన స్త్రీ, పురుషుల మధ్య లైంగిక చర్య బలవంతంగా, భార్య కోరికలకు విరుద్ధంగా జరిగినప్పటికీ అది అత్యాచారం కాదని, ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఒక వ్యక్తి తన భార్యకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగానైనా జరిపిన లైంగిక సంపర్కం అత్యాచారం కాదు. దానిని హత్యాచార నేరం కింద పరిగణించబడదు అని ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

తనకు ఇష్టం లేకున్నా తన భర్త తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ హైకోర్టులో కేసు వేయడంతో కేసును పరిశీలించిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. చట్ట ప్రకారం భర్త అయినందున అతను చేసిన పనిని చట్టవిరుద్ధమైనదిగా భావించలేమని స్పష్టం చేసింది. బాధిత మహిళకు సదరు వ్యక్తితో గతేడాది నవంబర్ 22న వివాహం జరుగగా పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త కుటుంబ సభ్యులు తనపై ఆంక్షలు పెట్టడం ప్రారంభించారని, నిత్యం తనను దూషిస్తూ, అధిక కట్నం డిమాండ్ చేశారని సదరు మహిళ తన పిటిషన్‌లో ఆరోపించింది. అంతేకాదు.. వివాహమైన నెల రోజుల తరువాత తన ఇష్టానికి విరుద్ధంగా తన భర్త తనతో లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడని ఆరోపించింది. దంపతులిద్దరూ జనవరి 2వ తేదీన ముంబై సమీపంలోని మహాబలేశ్వర్‌ అనే హిల్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భర్త తన భార్య కోరికకు విరుద్ధంగా మళ్లీ లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ ఘటన తరువాత తాను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యానని, నడుము కింది భాగంలో పక్షవాతం మాదిరిగా వచ్చిందని వైద్యులు తెలిపినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఈ ఘటన తరువాత సదరు మహిళ తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ముంబైలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •