వార్తలు (News)

సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాకు వస్తున్నారు. ఈ వివాహానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం హాజరు కానుండగా వివాహం అనంతరం అక్కడి నుంచి రాత్రి 7 గంటల ప్రాంతంలో కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ఇంకా ఇవాళ రాత్రి కరీంనగర్ జిల్లాలోనే బస చేయనున్నారు సీఎం కేసీఆర్.

రేపు ఉదయం కార్మిక విభాగం నాయకుడు ఎల్. రూప్ సింగ్ కూతురి వివాహానికి హాజరు అయి అనంతరం దళితబంధు నిధుల వినియోగంపై సమీక్ష జరపనున్నారు. దళిత బంధు పథకం అమలు, హుజురాబాద్ ఉప ఎన్నికపై ఈ సమీక్ష లో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •