క్రైమ్ (Crime) వార్తలు (News)

భారీగా కాలిఫోర్నియం ఖనిజం పట్టివేత!!

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా విమానాశ్రయంలో భారీగా కాలిఫోర్నియం ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సిఐటి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఖనిజం విలువ సుమారు రూ. 4,250 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా! స్మగ్లింగ్‌కు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నారు. వీరి నుండి సుమారు 250.5 గ్రాముల బరువు ఉన్న బూడిద రంగు రాళ్లు నాలుగు ముక్కలను అధికారులు గుర్తించారు. ఈ రాళ్లు చీకట్లో మెరవడమే కాకుండా.. ఆ రాళ్ల నుంచి కాంతి ప్రతిబింబించడాన్ని అధికారులు గుర్తించారు. ఇవి కాలిఫోర్నియం కావొచ్చని భావించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలిఫోర్నియం ఖనిజం ధర భారత కరెన్సీ ప్రకారం చూస్తే గ్రాము రూ. 17 కోట్లు ఉంటుంది.

రేడియోధార్మిక పదార్ధం అయిన కాలిఫోర్నియంను సామాన్యులు కొనలేరు, అమ్మలేరు. ఇది చాలా ఖరీదైనదే కాకుండా లైసెన్స్‌దారుల ద్వారా మాత్రమే విక్రయించబడుతాయి. ముంబైలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుండి మాత్రమే కాలిఫోర్నియం దేశంలోకి సరఫరా అవుతుంది. ఈ రేడియోధార్మిక పదార్థం కాలిఫోర్నియం సింథటిక్‌. దీని రంగు వెండి మాదిరిగా ఉంటుంది. కాలిఫోర్నియం సబ్బు లాంటిది, దీనిని బ్లేడుతో ముక్కలుగా కట్‌ చేయవచ్చు. కాలిఫోర్నియం ఉత్పత్తి చాలా తక్కువ. ఇది చాలా అరుదు. అందుకే ఒక గ్రాము కాలిఫోర్నియం ధర రూ. 170 మిలియన్లకు పైగా ఉంటుంది.

కాలిఫోర్నియంను వైద్యరంగం, పారిశ్రామిక రంగంలోనూ వినియోగిస్తారు. ముఖ్యంగా వైద్య రంగంలో క్యాన్సర్‌ రోగుల కోసం, ఎక్స్‌-రే యంత్రాలలో ఉపయోగించగా పారిశ్రామిక రంగంలో పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్‌లతో పాటు, చమురు బావులలో నీరు, చమురు పొరలను గుర్తించడం, బంగారం, వెండిని గుర్తించడం కోసం ఉపయోగిస్తారు. ఈ కాలిఫోర్నియం ఒక ప్రమాదకరమైన రేడియోధార్మిక లోహం, ఇది మనుషులకు, జంతువులకు, పక్షులకు ప్రాణాంతకం. దీని ప్రభావం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పూర్తి ధ్వంసం చేస్తుంది. లుకేమియా, గర్భస్రావం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశమూ ఉంది. సంతానోత్పత్తిపై ఈ ఖనిజం తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •