అంతర్జాతీయం (International) వార్తలు (News)

మోడెర్నా టీకాల వాడకాన్ని నిలిపివేసిన జపాన్‌..కారణం??

జపాన్‌లో 1.63 మిలియన్ల మోడెర్నా కోవిడ్‌ టీకా డోసుల వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు, వీటిలో మలినాలు ఉన్నట్లు నివేదికలు రావడంతో ఈ చర్యకు ఉపక్రమించినట్టు డ్రగ్‌ తయారీదారు తకేడాతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.

జపాన్‌లో మోడెర్నా, రవాణా బాధ్యతలు వహిస్తున్న తకేడా, పలు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో తెరవబడని సీసాల్లో పెద్ద సంఖ్యలో మలినాలు ఉన్నట్లు నివేదికలు అందాయని, ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదించి, ఆగస్టు 26 నుండి వ్యాక్సిన్లు వాడకాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ విషయాన్ని మోడెర్నాకు తెలియజేశామని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    19
    Shares
  • 19
  •  
  •  
  •  
  •