జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మాదాపర్ గ్రామ సంపద రూ. 5 వేల కోట్లు.. !!

గుజరాత్‌లోని మాదాపర్ గ్రామం దేశంలోని చాలా మందికి తెలియని పేరు. అయితే ఒక ప్రత్యేక కారణంతో, ఈ గ్రామం ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ గ్రామం ప్రపంచంలో అత్యంత ధనిక గ్రామంగా రికార్డుకు ఎక్కింది.

లెక్కల ప్రకారం, మాదాపార్‌లో మొత్తం 600 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో 16 బ్యాంకులు ఉన్నాయి. గ్రామస్తులు ఈ 16 బ్యాంకులలో రూ. 5,000 కోట్లు డిపాజిట్ చేయడం విశేషం. మొత్తం ప్రపంచంలోనే ఓ గ్రామం ఇంత పెద్ద ఎత్తున పొదుపు చేయడం ఓ అద్భుతంగా చెబుతున్నారు. ఈ గ్రామంలో 16 బ్యాంకులు మాత్రమే కాకుండా ఇంకా పాఠశాలలు-కళాశాలలు, సహాయ కేంద్రాలు, దేవాలయాలు, ఆనకట్టలు ఉన్నాయి.

మాధాపార్ గుజరాత్ లోని కుచ్ జిల్లాలోని 17 గ్రామాలలో ఒక గ్రామం. గ్రామస్తుల సగటు ఆదాయం సంవత్సరానికి సుమారు 15 లక్షల రూపాయలు. భారతదేశంలోని చాలా పెద్ద నగరవాసులకు అలాంటి ఆదాయం లేదని తెలిసిందే కదా! ఈ గ్రామంలోని నివాసితులలో ఎక్కువ భాగం ఎన్నారైలు, బ్రిటన్, అమెరికా మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వారు ఈ దేశాల నుండి ప్రతి నెల తమ బంధువులకు భారీ మొత్తంలో డబ్బును పంపడంతో ఈ గ్రామం అభివృద్ధి చెందుతోంది. వీరు వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులు ప్రధానంగా ముంబైకి తరలిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •