జాతీయం (National) వార్తలు (News)

జీవితకాల గరిష్ఠానికి చేరిన నిఫ్టీ!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిసాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను తాకింది. ఉదయం సెన్సెక్స్‌ 55,862 పాయింట్ల వద్ద నష్టాల్లో ఆరంభమై ఇంట్రాడేలో 55,675 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయికి దిగివచ్చి చివరకు 175 పాయింట్ల లాభంతో 56,124 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 68 పాయింట్లు పెరిగి 16,705 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు రాణించాయి. ఎంఅండ్‌ఎం, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •