అంతర్జాతీయం (International) వార్తలు (News)

నింగ్‌బో పోర్టు మూసివేత.. భారత్‌లో పండగ సీజన్‌పై దెబ్బ!

ప్రపంచంలో అత్యంత రద్దీ గల పోర్టుల్లో మూడోదైన నింగ్‌బో పోర్టు ఇటీవలే తెరుచుకుంది. అక్కడ పనిచేసే ఓ కార్మికుడు కరోనా వైరస్‌ బారిన పడడంతో పోర్టును మూసివేశారు. దీని ప్రభావం ప్రపంచ వాణిజ్యంతో పాటు భారత్‌పై కూడా పడింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

సరిగ్గా పండగ సీజన్‌కి ముందు పోర్టు మూసివేయడం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండగా చిప్‌సెట్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెసర్లు, టీవీ ప్యానెళ్ల వంటి పరికరాల్లో 70 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. పోర్టు మూసివేతతో గత కొన్నిరోజులుగా వీటి సంబంధించిన కంటైనర్లేవీ భారత్‌కు చేరుకోకపోవడంతో పెద్ద కంపెనీలు చాలా వరకు పండగ ఆఫర్లను పక్కనపెట్టే యోచనలో ఉన్నాయి. సాధారణంగా భారత్‌లో పండగ సీజన్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువులు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు గిరాకీ ఎక్కవగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థలు జులై, ఆగస్టు, సెప్టెంబరులో వాటి ఉత్పత్తిని పెంచుతాయి. కానీ, నింగ్‌బో పోర్టు మూసివేతతో ఈసారి పరిస్థితులు మాత్రం మారిపోయాయి.

ఈ పరికరాల కొరత ఇప్పట్లో తీరే సూచనలు లేకపోవడంతో టీవీలు, ఏసీ, రిఫ్రిజిరేటర్లు, నోట్‌బుక్‌లు, స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రికల్‌ గహోపకరణాల ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఔషధ పరిశ్రమపై మాత్రం ఈ ప్రభావం పెద్దగా లేకపోవడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •