జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

మదర్‌ థెరెసా పుట్టినరోజు సందర్భంగా పోస్టేజ్‌ స్టాంప్‌ విడుదల!!

మదర్‌ థెరెసా సేవ, ప్రేమకు అసలైన అర్ధం! గురువారం ఆమె 111వ పుట్టినరోజు సందర్భంగా ఐక్యతరాజ్యసమితి మదర్‌ థెరెసా ఫొటో పక్కనే ‘‘మనం అందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు. కానీ చిన్న పనులను ప్రేమతో చేయొచ్చు’’ అనే క్యాప్షన్‌ జత చేసి ఉన్న ఓ పోస్టేజ్‌ స్టాంప్‌ని విడుదలచేసింది. 1910, ఆగస్టు 26న ఉత్తర మేసిడోనియాలోని స్కోప్జీలో జన్మించిన మదర్‌ థెరెసా 12ఏళ్లకే తన జీవితాన్ని సేవకే అంకితం చేశారు. 1928లో ఐర్లాండ్‌ ఏడాది అనంతరం భారత్‌లోని కోల్‌కతాకు వచ్చారు. ఆపై బాలికల సెయింట్‌ మేరిస్‌ లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో 1948లో ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి పట్నాలో వైద్యశిక్షణ తీసుకొని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని స్థాపించారు. లెప్రసీ, క్షయ వ్యాధి, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ బాధితులతో పాటు పేదలను ఆదుకున్నారు. ఆ మాతృ మూర్తిని గురించి ఎంత చెప్పిన ఇంకా ఏంటో మిగిలిపోతుంది అలాంటి ఆమెకు దక్కవలసిన గౌరవం ఆలస్యంగా అయినా అందిందని చెప్పవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •