అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

ఎరుపు రంగులోకి మారిన నది నీరు!!

కాబుల్ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మాహుతి దాడులతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాలతో నిండిపోయింది. అప్పటివరకూ తమ పక్కనే ఉన్న వ్యక్తుల శరీర భాగాలు తునకాతునకలుగా మారిపోవడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేచింది. సుడిగాలులకు ప్లాస్టిక్ కవర్లు గాల్లోకి లేచినట్లు, శరీరభాగాలు ఎగిరిపడడంతో హఠాత్పరిణామానికి అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఇమ్మిగ్రేషన్ వీసాపై యూఎస్ వెళ్తోన్న ఒక వ్యక్తి తన కళ్లెదుట జరిగిన దారుణం గురించి మీడియా ఎదుట వాపోయారు.

‘ఒక్కసారిగా నా కింద భూమి కంపించినట్లై పెద్దపెట్టున వచ్చిన శబ్దాలకు కొద్దిసేపటివరకూ నాకేం వినిపించకపోవడంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. సుడిగాలులకు ప్లాస్టిక్ కవర్లు గాల్లోకి లేచినట్లు శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రపంచం అంతమయ్యే రోజును ఎవరు చూడలేరు. కానీ నేనీరోజు దాన్ని చూశాను. మృతదేహాలు రోడ్డు, మురుగుకాలువలో పడిపోయాయి. ఆ కాలువలోని కొద్దిపాటి నీరు ఎర్రగా మారిపోయింది’ అని ఆ వ్యక్తి భయంతో వణికిపోయారు. తన వివరాలు చెప్పడానికి మాత్రం నిరాకరించారు. ‘శారీరకంగా నేను బాగానే ఉన్నా. మానసికంగా కలిగిన ఈ గాయం మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. ఈ పేలుళ్లతో నేను ఎప్పటికీ మామూలుగా ఉండలేను’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    17
    Shares
  • 17
  •  
  •  
  •  
  •