వార్తలు (News)

కూలి చేసుకునే వ్యక్తికీ రూ.1,48,371 కరెంటు బిల్!!

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప కూలి జీవితం గడుపుతున్నారు. ఆయన ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్‌ ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్‌ బిల్లు రూ.200- 300 మధ్య వచ్చేది. కానీ ఈ మధ్య ఓసారి ఏకంగా రూ.1,48,371 రావడంతో ఒక్కసారిగా భయపడ్డారు. ఇదే విషయం మీద పలుమార్లు విద్యుత్‌శాఖ సిబ్బంది చుట్టూ తిరిగితే రూ.56,399కి తగ్గించి కట్టాలని చెబుతున్నారని.. కానీ తాము అంత బిల్లు చెల్లించలేమని పర్వతప్ప కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే గ్రామంలో మరికొందరికి కూడా అధికంగానే కరెంట్‌ బిల్లు వచ్చింది. బండయ్య అనే వ్యక్తికి ఓసారి రూ.78,167, మరోసారి రూ.16,251 వచ్చింది. సాధారణ కూలి పని చేసుకుని జీవించే తమకు ఇంత కరెంట్‌ బిల్లు వస్తే ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్‌శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా సాంకేతిక సమస్య లేదా సిబ్బంది బిల్లు తీసేటపుడు పొరపాటు చేసి ఉండొచ్చన్నారు. అవకాశం ఉంటే వారి బిల్లు తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    6
    Shares
  • 6
  •  
  •  
  •  
  •