క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం లో బిగుస్తున్న ఉచ్చు??

శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైస్‌ చాన్స్‌లర్‌ మల్లేశ్, రిజిస్ట్రార్‌ భరత్, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్‌తో మాట్లాడి ఆ వ్యవహారంపై వివరాలు తెలుసుకుని, పరీక్షల విభాగాన్ని పరిశీలించి అందులో పనిచేసే 22 మంది సిబ్బందితో విచారించారు.

సాధారణంగా డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుండగా, తీరా పరీక్షల సమయందాకా విద్యార్థులను అనుమతించేవారు. ఇక నుంచి ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైతే అరగంట ముందుగానే అంటే 9.30గంటలకు, మధ్యాహ్నం పరీక్ష రెండు గంటలకు ప్రారంభమైతే 1.30 గంటలకే విద్యార్థులు పరీక్షాకేంద్రంలో ఉండాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీని వల్ల ప్రశ్నపత్రాలు లీక్‌ కాకుండా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈ సమయం తర్వాత విద్యార్థులు వస్తే అనుమతించబోరు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •