వార్తలు (News)

కారు పల్టీ కొట్టిన ఘటనలో మహిళ మృతి!!

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల కేంద్రానికి చెందిన వైద్యుడు చిప్ప రమేశ్‌ సొంత కారులో భార్య స్వరూపరాణి(49), కూతుళ్లు కావ్యనాయుడు, శ్రావ్యనాయుడు, అన్న కుమారుడు అజయ్‌కుమార్‌తో కలసి రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ దేవాలయానికి బుధవారం ఉదయం బయల్దేరి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారుకు చేరుకోగానే కారు ఎడమ వైపు నుంచి మరో వాహనం వేగంగా అధిగమిస్తూ వెళ్లడంతో ఆందోళనకు గురైన రమేశ్‌ తన కారు మరో వాహనాన్ని ఎక్కడ ఢీకొంటుందనే భయంతో ఒక్కసారిగా కుడివైపునకు తిప్పగా కారు అదుపుతప్పి విభాగినిని ఢీకొట్టి అవతలి వైపునకు పల్టీలు కొట్టింది. అక్కడి హోటల్‌ వారు క్షతగాత్రులను బయటకు తీశారు.

స్వరూపరాణికి తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంటలోపు ఆమె మృతి చెందింది. అజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •