టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

డిగ్రీ చదివిన వారికోసం అమెజాన్ లో 5,000 ఉద్యోగాలు!

డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు అమెజాన్ అదిరిపోయే తీపికబురు అందిస్తూ 5,000 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అమెజాన్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అమెజాన్ సెల్లార్ సపోర్ట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పని చేయొచ్చు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంగ్లీష్ పై పట్టు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. https://amazonvirtualhiring.hirepro.in/registration/incta/ju0f4/apply/?j=56345&e=12199 వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు 2,75,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

మొదట అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న వారికి అప్లికేషన్ ను ధృవీకరిస్తూ మెయిల్ వస్తుంది. ఆ తర్వాత ఆన్ లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్ లైన్ పరీక్షలో ఎక్కువగా ఇంగ్లీష్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం. ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఇంటర్నెట్ ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిగ్రీ చదివిన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •