జాతీయం (National) వార్తలు (News)

వరుసగా రెండో రోజు కూడా పెరిగిన డీజిల్ ధరలు!!

దేశంలో డీజిల్‌ ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. లీటర్‌ డీజిల్‌పై గరిష్ఠంగా 25 పైసలు పెంచుతున్నట్లు సోమవారం ప్రభుత్వం రంగ చమురు విక్రయ సంస్థలు ప్రకటించాయి. గత వారం రోజుల్లో డీజిల్‌ ధరల్ని పెంచడం ఇది మూడోసారి! దీంతో కొన్ని రోజుల క్రితం తగ్గించిన ధరల ప్రయోజనం అందకుండా పోతోంది. పెట్రోల్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. తాజా పెంపుతో లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ.89.32, ముంబయిలో రూ.96.94కు చేరింది. సెప్టెంబరు 24 తర్వాత లీటర్‌ డీజిల్‌ ధర 70 పైసలు పెరిగింది.

ప్రధాన నగరాల్లో లీటర్‌ డీజిల్‌ పెట్రోల్‌ ధరలు..

నగరం    పెట్రోల్‌(రూ.లలో) డీజిల్‌(రూ.లలో)
హైదరాబాద్‌  105.42 97.46
విజయవాడ  107.49 99.14
విశాఖపట్నం 107.02 98.03
దిల్లీ  101.19 89.32
ముంబయి   107.26 96.94
బెంగళూరు     104.7 94.9
చెన్నై 98.96 94.08
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •