క్రైమ్ (Crime) వార్తలు (News)

ముగ్గురు సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ రద్దు చేసిన జిల్లా పంచాయతీ అధికారి !!

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులో కోర్టు ధిక్కారానికి పాల్పడిన ముగ్గురు సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ రద్దు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు.

శనివారం ఆయనొక జిల్లాలో 3,098 ఉపాధి హామీ పనులకు రూ.57.78 కోట్లు చెల్లించాల్సి ఉందని, కలెక్టర్‌ నిధులు విడుదల చేయాలని ఆదేశించారని తెలిపారు. ఎచ్చెర్ల మండలం బడేవానిపేట సర్పంచ్‌ కారి చిన పాపారావు, హిరమండలం మండలం కిట్టాలపాడు సర్పంచ్‌ గొంటి ప్రభావతి, అంబావల్లి సర్పంచ్‌ గూడేన శంకరరావు నిధులు విడుదల చేయలేదని, కోర్టు ధిక్కార చర్యగా భావించి వారి చెక్‌ పవరు రద్దు చేసినట్లు చెప్పారు. ఈ చెక్‌ పవరును ఇఒపిఆర్‌డి, పంచాయతీ కార్యదర్శులకు సంయుక్తంగా అనుమతించామని, చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న 262 మంది సర్పంచులకూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •