ఇంటర్ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! కానీ కరోనా కారణంగా తరగతి లో పాఠాలు వినలేకపోయామని, ఆన్లైన్ క్లాసుల కారణంగా నష్టపోయామని తమను పాస్ చేయాలంటూ కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో ప్రభుత్వం ఫెయిల్ అయిన విద్యార్థులు అందర్నీ 35శాతం మార్కులతో పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా ఇప్పుడు విద్యార్థులకు మార్కులు పెంచుకునే అవకాశాన్ని కూడా ఇంటర్ బోర్డ్ కల్పించింది.

అతి త్వరలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలతో పాటు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు, మార్కులు పెంచుకోవాలి అనుకునేవాళ్లు ఇంప్రూవ్ మెంట్ రాసుకోవచ్చు అని మంత్రి సబితా ఇంద్రరెడ్డి తెలిపారు. దీంతో ఇప్పటికే కొంతమంది రివాల్యూయేషన్ కు అప్లై చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళు రివాల్యూయేషన్ క్యాన్సిల్ చేసుకుంటే వారికి డబ్బులు తిరిగి ఇస్తామని కూడా చెప్పారు.