తెలంగాణలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భద్రాచలాన్ని మొదటిగా చెప్పుకోవాలి. రాములవారు కొలువుదీరిన భద్రాచలం కు శ్రీరామ నవమి సమయంలో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. తాజాగా భద్రాచలం వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం లోని రోజు వారీ వసతి గదుల అద్దె పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త సంవత్సరం ప్రారంభం నుండి అంటే జనవరి 1 నుండి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే.. ప్రస్తుతం రోజుకు రూ.800 ఉన్న గది ధర ఇప్పుడు రూ.999 అయ్యింది. నాన్ ఏసి గది ధర రూ. 300 ఉండగా ఇప్పుడు రూ.400 అయ్యింది. అదే విధంగా డబుల్ బెడ్ రూం ధర రూ.1500 ఉండగా ఇప్పుడు రూ.2,500 అయ్యింది. సింగిల్ బెడ్ రూం ధర రూ.800 ఉండగా ఇప్పుడు రూ.1000కి పెరిగింది. పెరిగిన ధరలతో పాటూ 12శాతం జీఎస్టి అదనంగా వసూలు చేయనున్నారని సమాచారం.