దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ఆరంభించాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 281 పాయింట్ల నష్టంతో 56,843 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 16,921 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్, టాటా స్టీల్‌, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.