వంద అడుగుల వెడల్పు, యాభై నాలుగు అడుగుల ఎత్తు సుమారు 650 మంది సీటింగ్ కెపాసిటీ ఉండి సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ గా పేరు తెచ్చుకున్న ‘వి ఎపిక్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఉంది. ప్రపంచంలో ఇది మూడో భారీ స్క్రీన్.. రూ. 40 కోట్లతో దీనిని నిర్మించారని సమాచారం. నెల్లూరు జిల్లావాసులతో పాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కారణంగా అటు నుండి ఇటు ప్రయాణాలు చేసే ప్రజలు సైతం ఆ థియేటర్లో సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ‘సాహో’ సినిమా తో ఈ థియేటర్‌లో షోలు మొదలయ్యాయి. దీనిని రామ్ చరణ్ ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఏపీలో టికెట్ రేట్స్ ప్రభావంతో ఆ థియేటర్ మూతపడింది.

‘వి ఎపిక్’ మూత పడింది. ఇండియాలో, సౌత్ ఆసియాలో భారీ స్క్రీన్ అయినప్పటికీ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి థియేటర్ నిర్మించినప్పటికీ కూడా అది గ్రామ పంచాయతీ పరిథిలో ఆ థియేటర్ ఉంది. దాంతో ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లకు టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయతీ పరిధిలో రూ 5, 10, 15 రూపాయల రేట్లను ప్రభుత్వం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రేట్లకు టికెట్లు అమ్మడం కంటే థియేటర్ మూసి వేయడం వల్ల వచ్చే నష్టాలు తక్కువ అని యాజమాన్యం భావించింది. దాంతో తెరపై సినిమాలు ప్రదర్శించడం మానేసి, మూసేసింది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోని సుమారు 60 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ మొత్తంగా చూసుకునే వందకు పైగా థియేటర్లకు తాళాలు పడినట్టు సమాచారం.