దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత కోలుకుని లాభాలబాట పట్టాయి. ఉదయం సెన్సెక్స్‌ 56,948.33 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై దాదాపు రెండు గంటల పాటు అదే బాటలో పయనించి, తర్వాత లాభాల్లోకి ఎగబాకి 57,512.01 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 295.93 పాయింట్ల లాభంతో 57,420.24 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 16,937.75 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,112.05 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 82.50 పాయింట్లు లాభపడి 17,086.25 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 లో పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐ సి ఐ సి ఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ముగిసాయి. భారతి ఎయిర్ టెల్, రిలయన్స్, మారుతీ, ఆసియన్ పెయింట్స్, ఇండస్ ఇందు బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ను ముగించాయి.