కొత్త సంవత్సరం నుంచి రైల్వే శాఖ.. ప్రయాణీకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రారంభించనుంది. కరోనా మహమ్మారికి ముందున్నట్టే జనరల్ కోచ్‌లలో రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. కరోనా విజృంభన, లాక్ డౌన్ కారణంగా గతంలో జనరల్ కోచ్‌లలో ప్రయణాన్ని రైల్వేశాఖ నిలిపివేసింది. కానీ ఇప్పుడు తిరిగి జనవరి 1 నుంచి ఆ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. దేశంలో కరోనా తగ్గుతుండడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ నేపథ్యంలో పాత పద్ధతుల్ని తిరిగి అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సరం నుంచి ప్రయాణీకులు జనరల్ టికెట్‌పైనే ప్రయాణం చేయవచ్చు. కాకపోతే తొలిదశలో కొన్ని ప్రత్యేక రైళ్లలో మాత్రమే ఈ పాత సౌకర్యం కల్పించనుంది.