వార్తలు (News)

మహారాష్ట్రలో 25 జిల్లాల్లో తీవ్ర రూపం దాల్చిన కరోనా

కరోనా సోకిన ఒక వ్యక్తి 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్‌ను అంటించే అవకాశం ఉందని, మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయని, దేశంలోని 59.8 శాతం కేసులు ఈ జిల్లాల నుంచే వస్తున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 90 శాతం మరణాలు.. 45 ఏళ్లకు పైగా వయసున్న వారిలోనే సంభవిస్తున్నాయని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మాస్కులపై 90 శాతం ప్రజలకు అవగాహన ఉన్నా 44 శాతం మందే ధరిస్తున్నారని, అందుకే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, 46 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో చర్చించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.