వార్తలు (News)

యాదగిరిగుట్టనూ వదలని కరోనా

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక అర్చకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. 26న మరికొందరు పరీక్షలు చేయించుకోగా నలుగురు యాదాద్రి అర్చకులు, సిబ్బంది, మరో ఇద్దరు హయగ్రీవ స్వామి ఆలయ అర్చకులకు పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. నిన్న చేసిన పరీక్షల్లో మరో ౩౦ మందికి కరోనా సోకినట్లు తేలింది. ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా, మాస్కులు ధరించకుండానే ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నారు. కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. ఈ కారణంగా మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఇప్పుడు అప్రమత్తమైన అధికారులు ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఈఓ, వివిధ సెక్షన్ల కార్యాలయాల్లో శానిటైజేషన్‌ చేశారు. క్యూలైన్లలో శానిటేషన్‌ డబ్బాలు ఏర్పాటు చేస్తూ పారిశుద్ధ్య సిబ్బందితో ఆలయ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.